శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (17:53 IST)

జులై 2న అడివిశేష్ `మేజ‌ర్‌`

Adavi Sesh, Major Unni krishanan
'మేజర్' చిత్రం విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గెటప్లో ఉన్న  అడివి శేష్ పోస్టర్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ చిత్రాన్ని జూలై 2న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ  విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో అడివిశేష్ తుపాకీ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.
 
అడివి శేష్ పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన ఈ క్రేజి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రం నుండి రిలీజ్‌చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్  ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాల‌ను భారీగా పెంచుతూ వ‌చ్చింది.  

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది.  అతను చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం.
 
తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.
 
మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన `మేజర్` చిత్రీక‌ర‌ణ అతి త్వ‌ర‌లో పూర్తికానుంది.