శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (23:15 IST)

జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత.. ఆస్పత్రిలో ఐశ్వర్య

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య మరోసారి ఆసుపత్రి పాలైంది.  కరోనా సోకడంతో గతంలో ఐశ్వర్య హాస్పిటల్‌లో చేరింది. తాజాగా మరోసారి ఐశ్వర్య హాస్పిటల్‌లో చేరింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. 
 
హాస్పిటల్‌లో డాక్టర్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..'జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి నేను ఆసుపత్రిలో చేరాను. అండగా డాక్టర్ పక్కనే వున్నారని.. ఈ ఉమెన్స్ డే ని ఇంత మంచి వారితో మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉంది.

థ్యాంక్ యు మేడం' అంటూ డాక్టర్ గురించి, తన గురించి పోస్ట్ చేసింది. అలాగే హాస్పిటల్‌లో ఉన్న నర్సులతో ఫోటో దిగి ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ ఉమెన్స్ డే శుబాకాంక్షలు తెలిపింది ఐశ్వర్య.