శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (13:13 IST)

హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం.. ఇంజక్షన్లు వికటించి ఇద్దరు చిన్నారుల మృతి

హైదరాబాద్ నిలోఫర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లు, నర్సులు ఇంజక్షన్లు చేయకుండా ఆయాలు ఆ ఇంజక్షన్లను వేయడం వల్లే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజ‌క్ష‌న్ ఇచ్చిన క్ష‌ణాల్లో చ‌నిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ముక్కు ప‌చ్చ‌లార‌ని ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోయేందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకా చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. ఆసుప‌త్రి సిబ్బంది అలెర్ట్ అయింది. ఈ విష‌యంపై నిలోఫ‌ర్ వైద్యులు స్పందించారు. ఆసుప‌త్రికి తీసుకొచ్చే స‌మ‌యానికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని చెప్పారు.