శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (11:23 IST)

#HBDNagarjuna : ప్రవీణ్ సత్తారు మూవీ టైటిల్ ఖరారు

అక్కినేని నాగార్జున తన పుట్టిన రోజు వేడుకలను ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా వెల్లడించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి "ది ఘోస్ట్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అలాగే, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. 
 
ఈ యేడాది నాగార్జున కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ మూవీతో పలకరించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
 
ఇక ప్రవీణ్ సత్తారు మూవీలో నాగార్జున .. ‘రా’ ఏజెంట్ పాత్రలో అలరించనున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
తాజాగా విడుదల చేసిన లుక్‌లో నాగార్జున వర్షంలో కత్తి పట్టుకుని ఉన్నారు. ఎదురుగా విలన్స్‌ను చూపించారు. మొత్తంగా ప్రవీణ్ సత్తారు.. నాగార్జునతో సాలిడ్ యాక్షన్ ఎంటర్టేనర్‌ తెరక్కిస్తున్నట్టు  అర్ధం అవుతోంది. శతృవులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌ను చూస్తే అర్ధమవుతోంది.