శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 జూన్ 2020 (17:55 IST)

అయ్యప్పను నమ్ముకున్న అఖిల్, కారణం ఇదేనా..?

అక్కినేని అఖిల్ నటించిన మొదటి మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను.. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అఖిల్‌తో పాటు అక్కినేని అభిమానులు చాలా డీలాపడ్డారు. హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు ఖచ్చితంగా సక్సస్ అవుతాయి అనుకున్నారు కానీ.. అలా కాకపోవడంతో నాగార్జున షాక్ అయ్యారట. 
 
అఖిల్ మూవీ ఫ్లాప్ అని తెలిసి దాని నుంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టిందట. ఓ సందర్భంలో స్వయంగా నాగార్జునే చెప్పారు. ఇదిలావుంటే... అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నారు.
 
దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ మూవీపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే... అఖిల్ ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. ఇది ఇప్పుడు అభిమానుల్లోను, ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే... ఈ సినిమాతో ఎలాగైనా సరే... సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకనే అయ్యప్స స్వామి మాల వేసుకున్నాడని అంటున్నారు. మరి... అఖిల్‌కి ఆశించిన విజయం ఈ సినిమాతో వస్తుందని.. బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ సాధిస్తాడని ఆశిద్దాం.