బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:54 IST)

అఖిల్ మూడ‌వ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

అక్కినేని అఖిల్ ఫ‌స్ట్ మూవీ అఖిల్, సెకండ్ మూవీ హ‌లో సినిమాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో అటు అక్కినేని అభిమానులు ఇటు అఖిల్ కూడా తాజా సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం అఖిల్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చే

అక్కినేని అఖిల్ ఫ‌స్ట్ మూవీ అఖిల్, సెకండ్ మూవీ హ‌లో సినిమాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో అటు అక్కినేని అభిమానులు ఇటు అఖిల్ కూడా తాజా సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం అఖిల్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంది. మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.
 
ఇటీవ‌ల ఈ మూవీ టీమ్ హైద‌రాబాదుకి చేరుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 19న సాయంత్రం 4 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. డిసెంబ‌ర్‌లో కానీ.. జ‌న‌వ‌రిలో కానీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి... అక్కినేని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తోన్న ఈ సినిమా అఖిల్‌కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.