`అలాంటి సిత్రాలు` హానెస్ట్ సినిమాః దర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ.
టాలీవుడ్‌లో ప్రస్తుతం వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్నచిత్రాలకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. నేపథ్యంలో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ సి.కృష్ణ మొదటి ప్రయత్నంలోనే మంచి కాన్సెప్ట్తో `అలాంటి సిత్రాలు` అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐ &ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానినికి రాహుల్ రెడ్డి నిర్మాతగా, ప్రముఖ జర్నలిస్ట్ శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె .రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది
ఈ సందర్భంగా దర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ మాట్లాడుతూ- ``ముందుగా అందరికీ ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా టైటిల్ చూసి చాలా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఇది ఒక ప్యూర్ హానెస్ట్ సినిమా. ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే అందరికీ నచ్చే సినిమా. రాఘవేంద్రరెడ్డిగారు మాకు ఫస్ట్ నుండి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్‌గా నిలబడ్డారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకి వర్క్ చేశారు. ఒక కొత్త టీమ్ చేస్తోన్న జెన్యూన్ ఎటంప్ట్ ఇది. తప్పకుండా మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను``అన్నారు.
ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో దిలీప్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది నాలుగు పాత్రలు ప్రధానంగా సాగే ఒక ఆంథాలజి ఫిలిం. ఈ సినిమాలో మా లవ్‌స్టోరీ చాల ఎమోషనల్‌గా ఉండి కన్వీన్సింగ్‌గా ఉంటుంది` అన్నారు.
అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ- `ఈ సినిమాలో నేను బాక్సర్ రోల్ చేస్తున్నాను. సప్రీత్ నా క్యారెక్టర్ గురించి చెబుతున్నప్పుడే రెగ్యులర్‌గా కాదు డిఫరెంట్‌వేలో రియలిస్టిక్‌గా చేద్దాం అని చెప్పారు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నా పాత్రని డిఫరెంట్ వేలో పోట్రేట్ చేశారు.`` అన్నారు.
నిర్మాత రాహుల్ రెడ్డి మాట్లాడుతూ- ``ఈ కథతో రాఘవేంద్ర రెడ్డిగారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మా బేనర్‌లో ఫస్ట్ మూవీ ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది``అన్నారు.
యష్ పురి మాట్లాడుతూ - ``నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు సుప్రిత్, నిర్మాతలకి థ్యాంక్స్. సినిమా బ్యూటిఫుల్‌గా వచ్చింది.ఈ సినిమా మార్పు గురించి ఉంటుంది. ఆ చేంజ్ అందరినీ ఎలా మార్చింది అనేదే కథాంశం``అన్నారు.
హీరోయిన్ శ్వేతా పరాశర్ మాట్లాడుత - `మంచి కాన్సెప్ట్‌తో తీసిన మా సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను``అన్నారు.
సమర్పకులు కే. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ- `మా సినిమా టీజర్ రిలీజ్ చేసి మాకు సపోర్ట్ చేసిన దిల్‌రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు`` అన్నారు