శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (12:33 IST)

సమంత ఐటమ్ సాంగ్ దుమ్ముదులిపేస్తుందిగా!

Samantha
పుష్ప సినిమాకు సమంత ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ పాటపై పురుష సంఘాలు మండిపడినా ఆ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 
 
సుకుమార్ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే. తాజాగా 'ఊ అంటావా మామా .. ఊ ఊ అంటావా మావా' అంటూ సాగే పుష్పలోని సమంత పాట కూడా దుమ్మురేపుతోంది. ఈ పాటను రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకుని 45 మిలియన్ వ్యూస్‌కి పైగా వచ్చాయి. 1.6 మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి.