ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (13:55 IST)

నా పరిస్థితి బ్యాడ్ నుంచి వరస్ట్ అయింది : వాపోతున్న తెలుగు హీరో

రెండు ప్రైవేట్ టెలికాం కంపెనీలపై తెలుగు హీరో అల్లు శిరీష్ ఫైర్ అయ్యారు. వోడాఫోన్‌ది చెత్త నెట్‌వర్క్ అంటూ ఫైరయ్యారు. ఎయిర్‌టెల్ బ్యాడ్ అయితే వోడాఫోన్ వరస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రెండు ప్రైవేట్ టెలికాం కంపెనీలపై తెలుగు హీరో అల్లు శిరీష్ ఫైర్ అయ్యారు. వోడాఫోన్‌ది చెత్త నెట్‌వర్క్ అంటూ ఫైరయ్యారు. ఎయిర్‌టెల్ బ్యాడ్ అయితే వోడాఫోన్ వరస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
గతంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను అల్లు శిరీష్ వాడుతూ వచ్చారు. అయితే, ఆ నెట్‌వర్క్ బాగోలేదని పేర్కొంటూ మొబైల్ పోర్ట‌బులిటీ ద్వారా వోడాఫోన్ నెట్‌వర్క్‌కు మారారు. ఈ నెట్‌వర్క్ మరింత అధ్వాన్నంగా ఉండటంతో అల్లు శిరీష్ ఆగ్రహానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఇటీవల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని వాడుకుంటూ వోడాఫోన్‌కు మారి, తన పాత నంబర్‌నే ఉపయోగిస్తున్నాననీ, ఇక వోడాఫోన్‌కు సిగ్నల్స్ అసలు అందడం లేదని, తాను ఓ చెత్త నెట్ వర్క్‌ను ఆశ్రయించానని గుర్తించిన శిరీష్, అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
'దేని విలువైనా అది నీ దగ్గరున్నంత కాలం తెలియదు. ఈమధ్యే ఎయిర్‌టెల్ నుంచి వోడాఫోన్ మారాను. నా పరిస్థితి బ్యాడ్ నుంచి వరస్ట్ అయింది. 4జీ గురించి మరచిపోండి. కనీసం 2జీ సిగ్నల్స్ కూడా అందడం లేదు. కాల్ డ్రాప్స్ సంగతి పక్కనబెట్టండి. కనీసం సిగ్నల్ కూడా అందని పరిస్థితి. చాలా చింతిస్తున్నాను. ఓ పాఠం నేర్చుకున్నాను' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ఓ సెలబ్రిటీగా ఉన్న శిరీష్ పెట్టిన పోస్టుపై వోడాఫోన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.