వేసవిలో ఫ్యామిలీస్‌ను ఎంటర్‌టైన్ చేసే ఫర్‌ఫెక్ట్ మూవీ "ABCD".. అల్లు శిరీష్
యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన ఎంటర్‌టైనర్ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి' ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. మే 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా సక్సెస్‌ను యూనిట్ సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్‌లో మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, 'నేడు సినిమా విడుదలైంది. మార్నింగ్ షోతోనే బలమైన ఓపెనింగ్స్‌తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఈవెనింగ్ షోతో తర్వాతనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. ఏదైతే ముందుగా మేం కథను అనుకున్నామో, తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ని కరెక్ట్‌గా సెట్ చేయాలి. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని అనుకున్నామో. అది ఈరోజు నేరవేరింది. శిరీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. మా బ్యానర్‌లో చేసిన 'ఏబీసీడీ'ని ప్రతిష్టాత్మకంగా చేశాం. అల్లు శిరీష్, కొత్త స్టార్‌గా మారాడని అందరూ అంటున్నారు. తనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు.
తనలో హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. అది ఈరోజు నేరవేరింది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ, భరత్, వెన్నెలకిషోర్ కామెడీ హైలైట్ అయ్యాయని అంటున్నారు. అమెరికాలో పుట్టిన ఓ యువకుడు ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్న విధానాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చేశారని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. 68 శాతంతో ఓపెనింగ్ అయిన ఈ సినిమా, 74 శాతం మ్యాట్నీకి పెరిగింది. సాయంత్రానికి అది 78 శాతం పెరిగింది. ఓ నిర్మాతగా చాలా సంతోషంగా ఉంది. మా శిరీష్ బెస్ట్ మూవీని 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాను ఈ వీకెండ్‌లో దాటాలని కోరుకుంటున్నాను. దాటుతామని నమ్మకంగా ఉన్నాం. త్వరలోనే పెద్ద సక్సెస్ మీట్‌ను నిర్వహంచబోతున్నట్టు చెప్పారు.
దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, 'మేం ఎక్కడ సినిమాకు మంచి స్పందన వస్తుందని అనుకున్నామో, దానికి ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. శిరీష్ యాక్టింగ్‌కి యూనానిమస్ యాక్టింగ్ చేశారు. ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్ రెడ్డికి, శిరీష్‌కి థాంక్స్' అని చెప్పారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ, 'ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలకు బెటర్‌గా ఓపెన్ అయ్యింది. పర్సనల్‌గా ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ కలుగుగుతుంది. ఈరోల్‌లో చేస్తున్నప్పుడు కనెక్ట్ అయ్యి బాగాఎంజాయ్ చేస్తూ చేశాను. ప్రతి షోకు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మధురగారు కోరుకున్నట్లు శ్రీరస్తు శుభమస్తు సినిమా కలెక్షన్స్‌ను దాటాలని కోరుకుంటున్నాను. నాకు మంచి సినిమా ఇచ్చిన మధుర శ్రీధర్‌గారికి, మంచి థియేటర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్‌బాబుకి థాంక్స్. సంజీవ్ నన్ను చూడని విధంగా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందరూ బాగున్నానని, బాగా చేశావని అంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం సంజీవ్‌కే దక్కుతుంది. ఇప్పటివరకు నా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఏ సినిమాకు రాలేదు. సంజీవ్, రామ్‌తోటలకు థాంక్స్. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీస్‌ను ఎంటర్‌టైన్ చేసే ఫర్‌ఫెక్ట్ మూవీ ఇది' అని చెప్పుకొచ్చారు.