త్రివిక్ర‌మ్ శ్రీనివాసా.. నువ్వు చెప్పింది నిజ‌మా..? (Video)

Allu Sirish
శ్రీ| Last Modified మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (21:45 IST)
అల్లు శిరీష్ కథానాయకుడిగా సంజీవి రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఏబీసీడీ. ఈ చిత్రంలో అల్లు శిరీష్ స‌ర‌స‌న‌ రుక్సార్ థిల్లోన్ న‌టించింది. మే 17వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మ‌ధుర శ్రీధ‌ర్ నిర్మించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రిలీజ్ చేసారు. లవ్, ఫ్రెండ్షిప్, కామెడీ.. సీన్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

అయితే... ఈ ట్రైల‌ర్ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... త‌ను ఈ సినిమాలో అల్లు శిరీష్‌కి ఫ్రెండ్‌గా న‌టించిన భ‌ర‌త్‌కి పెద్ద ఫ్యాన్‌నని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. రెడీ సినిమాలో చిట్టి నాయుడు పాత్ర‌లో భ‌ర‌త్ న‌ట‌న అంటే చాలా ఇష్టం అని పాత్ర పేరుతో స‌హా చెప్పాడు. దీంతో త్రివిక్ర‌మ్ చెప్పింది నిజ‌మా..?

భ‌ర‌త్‌కి త్రివిక్ర‌మ్ ఫ్యానా అని అక్క‌డ ఉన్న‌వారంద‌రూ షాక్ అయ్యారు. ఈ సినిమా మ‌ల‌యాళం ఏబీసీడీ చిత్రానికి రీమేక్. అక్క‌డ పెద్ద హిట్ అయ్యింది. మ‌రి... ఇక్క‌డ కూడా హిట్ అయి అల్లు శిరీష్‌కి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి. చూడండి ట్రెయిలర్..దీనిపై మరింత చదవండి :