గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (20:40 IST)

అల్లు శిరీష్ “ఏబీసీడీ” ఫస్ట్ లుక్‌కి సూపర్బ్ రెస్పాన్స్

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పైన యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించిన డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో హల్చ‌ల్ చేస్తోంది.
 
మెగా బ్రదర్ నాగబాబు అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. బాల నటుడు భరత్ ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండటంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. 2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎక్వైరీస్ హ్యూజ్‌గా రావటం ఈ చిత్రం క్రేజ్‌ని తెలియ‌జేస్తుంది.
 
ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మెగా బ్రదర్ నాగబాబు గారు కీలక పాత్రలో నటిస్తున్నారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. 
 
తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్‌ను హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ప్ర‌ముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించటం చాలా ఆనందంగా వుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అన్నారు.
 
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, భరత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు డి.సురేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్; జుధా సాంధీ, కో-ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, బ్యానర్స్: మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్, నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని, దర్శకుడు: సంజీవ్ రెడ్డి.