శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (22:46 IST)

అల్లు శిరిష్ ఏబీసీడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

అల్లు శిరీష్ హీరోగా నటించిన‌ తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైన  మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది మలయాళంలో 2013లో వచ్చిన సినిమా. దుల్కర్ సల్మాన్‌కి మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఈ కారణంగానే ఆ సినిమా రీమేక్‌లో అల్లు శిరీష్ న‌టించాడు.
 
ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేసారు. మే 17న విడుదల చేయ‌నున్న‌ట్టు హీరో అల్లు శిరీష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేక సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ కి ఈ సినిమా అయినా విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.