శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (21:10 IST)

'నగ్న షూట్‌'పై అమ్మకు చెబితే 'ఆ ఒక్కటి' కనిపించనీయకంది : అమలా పాల్

మలయాళ భామ అమలా పాల్. ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు పొందిన నటి. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత స్వేచ్ఛగా నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం "ఆమె". ఇందులో ఆమె నగ్నంగా నటించింది. దీనికి సంబంధించిన అనేక సన్నివేశాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో సహనటి ఆర్జే రమ్యను అమలాపాల్ ముద్దుపెంటుకుంటూ కనిపిస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో మరింత ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని అమలా దృష్టికి తీసుకెళితే ఆమె చాలా క్యాజువల్‌గా స్పందించింది. అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. పైగా, అది స్క్రిప్టులో లేదని, అనుకోకుండా తీసిన షాట్ అని చెప్పుకొచ్చింది. 
 
ఇక నగ్న సన్నివేశాల గురించి తన తల్లికి ముందే చెప్పానని, స్క్రిప్టుకు ఖచ్చితంగా అవసరమైతే నటించమని చెప్పి, నటించమని చెప్పి, కొన్ని జాగ్రత్తలు, సలహాలు చెప్పిందని అమల వెల్లడించింది. ఈ సినిమా శృంగార నేపథ్యంలో సాగేది కాదని, కంటెంట్ అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందేనని అమల తెలిపింది. ఈ చిత్రం నటిగా తనకు ఎంతో నమ్మకాన్నిచ్చిందని తెలిపింది. తనకు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని అమల స్పష్టంచేసింది