సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (15:15 IST)

బాలీవు్డ బిగ్ బికి ఆపరేషన్.. ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణంగా ఆయన ఓ ఆపరేషన్ చేయడం. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీనే సోషల్ మీడియాలో ‘శస్త్రచికిత్స’ అంటూ రాసుకొచ్చారు. ‘‘ఆరోగ్యం.. శస్త్రచికిత్స.. ఏం చెప్పాలి?’’ అని శనివారం రాత్రి తన ఆరోగ్య వివరాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. 
 
అయితే, శస్త్రచికిత్స చేయించుకున్నారా? చేయించుకోబోతున్నారా? అన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. అంతకుముందు రోజు ట్విట్టర్‌లోనూ దానిపై స్పందించారు. ‘‘ఏదో అవసరానికి మించి పెరిగింది.. కట్ చేస్తే మెరుగవుతుంది.. ఇదే జీవితం. రాబోయే రోజులు ఎలా ఉంటాయన్నది అవే చెబుతాయి’’ అని రాసుకొచ్చారు. 
 
తాజాగా.. శనివారం ప్రశ్నార్థకాలతో మరో ట్వీట్ చేశారు. అయితే, ఆయన కామెంట్‌పై అభిమానులు హైరానా పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు గత ఏడాది బిగ్ బీ సహా ఆయన ఇంట్లోని వారు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు అభిమానుల్లో అదే ఆందోళన వ్యక్తమవుతోంది. దాని తాలూకు ప్రభావాలు ఏమైనా ఉండొచ్చా అని అనుమానిస్తున్నారు. కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
 
ప్రస్తుతం బిగ్ బీ అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి "మేడే" అనే సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సెట్స్‌లోని ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 30న చెహ్రె, జూన్ 18న ఝుండ్‌లను సినిమాలను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.