వచ్చే యేడాది పెళ్లి పీటలెక్కనున్న నయనతార! (video)
అటు కోలీవుడ్... ఇటు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార. సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతోంది. అయితే, పలువురుతో ప్రేమాయణం కొనసాగించి అంతే హెడ్ లైన్స్‌లో నిలిచింది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న నయన్ త్వరలో పెళ్ళి చేసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార తొలిసారి ప్రభుదేవా ప్రేమలో పడగా, ఆయనతో కొన్నాళ్ళు డేటింగ్ చేశాక గుడ్‌బై చెప్పింది.
అనంతరం శింబుతో ప్రేమను కొనసాగించింది. వారిద్దరి మధ్య బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేకుండా పోయింది. ఇక ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న నయనతార ఆయనతో చెట్టా పట్టాలు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, విందులు, వినోదాలు వంటివి చేస్తూ ఫుల్ చిల్ అవుతుంది.
వీరిద్దరి పెళ్లికి సంబంధించి కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నా దీనిపై ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. తాజా సమాచారం ప్రకారం మార్చి నెలలో తన ప్రియుడితో కలిసి నయనతార పెళ్ళిపీటలెక్కనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలు చేస్తుందట. అలానే భర్తతో కలిసి సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూటర్‌గాను కొనసాగాలన్న బలమైన పట్టుదలతో నయనతార ఉన్నట్టు సమాచారం.