మ్యాక్స్‌వెల్‌కు డిమాండ్ తగ్గలేదుగా.. వామ్మో వేలంలో రూ.14.25 కోట్లు పలికాడు..
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. గత సీజన్‌లో అతనికి పది కోట్లు ఇచ్చినా పంజాబ్ తరఫున దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేదు. దీంతో ఆ టీమ్ అతన్ని వదిలేసింది.
కానీ ఈసారి రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇకపోతే.. ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలానికి మినీ వేలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ కు మొత్తంగా 1,114 మంది ప్లేయర్లు పేరు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల విజ్ఞాప్తి మేరకు 292 మంది ఆటగాళ్లను ఫైనల్ చేసింది బీసీసీఐ.
వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఐపీఎల్ లో 8 జట్లు పోటీపడనున్నాయి. గత నెలలో అత్యధికంగా 10 మందిని బెంగళూరు రిలీజ్ చేసింది.