#IPLAuction2021: అతి తక్కువ ధరకు స్టీవ్ స్మిత్.. ఎందుకని?
ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్ కోసం వేలం చెన్నైలో ప్రారంభమైంది. మొత్తం 292 మంది ప్లేయర్స్ ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో పలువురు విదేశీ, ఇండియన్ స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు.
8 ఫ్రాంచైజీలు తమకు అందుబాటులో ఉన్న మొత్తం, కావాల్సిన ప్లేయర్స్‌ను బట్టి వేలంలో బిడ్లు దాఖలు చేయనున్నాయి. మొదట వేలం ఎలా జరుగుతుందన్న అంశాలను ఫ్రాంచైజీలకు నిర్వాహకులు వివరిస్తున్నారు.
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన స్మిత్ కోసం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటగా బేస్‌ప్రైస్ దగ్గర బెంగళూరు బిడ్ మొదలుపెట్టింది.
ఆ వెంటనే క్యాపిటల్స్ 2.2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత ఎవరూ ముందుకు వెళ్లలేదు. దీంతో స్మిత్‌ను 2.2 కోట్లకు క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. గత ఐపీఎల్‌లో స్మిత్ ప్రదర్శనకు అనుగుణంగానే అతనిని జట్టులోకి తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు తొలి రౌండ్‌లో ఆరోన్ ఫిచ్, అలెక్స్ హేల్స్, హనుమ విహారి, జేసన్ రాయ్‌లాంటి స్టార్ ఆటగాళ్లు ఎవరినీ ఫ్రాంచైజీలు తీసుకోలేదు.