1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (15:46 IST)

నా ఆనందానికి అడ్డొస్తే అంతే.. ఎవరైనా సహించను : అమలాపాల్

తమిళ దర్శకుడు విజయ్‌తో జరిగిన తెగదెంపులపై నటి అమలా పాల్ ఎట్టకేలకు నోరు విప్పారు. తనకు కెరీర్‌ పరంగా లభించే ఆనందానికి ఎవరు అడ్డుపడినా సహించననీ, అలా అడ్డుపడేవారికి దూరంగా ఉండటం తన నైజమని చెప్పింది.

తమిళ దర్శకుడు విజయ్‌తో జరిగిన తెగదెంపులపై నటి అమలా పాల్ ఎట్టకేలకు నోరు విప్పారు. తనకు కెరీర్‌ పరంగా లభించే ఆనందానికి ఎవరు అడ్డుపడినా సహించననీ, అలా అడ్డుపడేవారికి దూరంగా ఉండటం తన నైజమని చెప్పింది. 
 
ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో తన తమ్ముడు ఒక్కడే అండగా నిలిచాడని అంటోంది. కెరీర్‌కి భర్త, అడ్డుపడుతుండడం వలనే విడాకులు తీసుకోవలసి వచ్చిందని పరోక్షంగా హింట్‌ ఇచ్చింది అమలాపాల్.
 
కాగా, తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. రెండేళ్ళ కాపురం తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కిన విషయం తెల్సిందే.