శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (09:16 IST)

''రంగస్థలం'' రంగమ్మత్తకు మహేష్ బాబు మురారి అంటే చాలా ఇష్టమట..

''రంగస్థలం'' రంగమ్మత్త తాజాగా ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ నటించిన సినిమాల్లో ఏ సినిమా ఇష్టమని ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు హాట్ యాంకర్ అనసూయ ఇలా బదులిచ్చింది. ప్రిన్స్

''రంగస్థలం'' రంగమ్మత్త తాజాగా ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ నటించిన సినిమాల్లో ఏ సినిమా ఇష్టమని ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు హాట్ యాంకర్ అనసూయ ఇలా బదులిచ్చింది. ప్రిన్స్ నటించిన చాలా సినిమాలు తనకిష్టమని, అందులో మురారీ అన్నింటికంటే ఇష్టమని తెలిపింది. 
 
తారక్ సినిమాల్లో రాఖీ, బృందావనం, అదుర్స్‌, నాన్నకు ప్రేమతో, జై లవకుశ సినిమాలంటే ఇష్టపడతానని చెప్పింది. దేవుడిని నమ్ముతానని, తన భర్తను ఎన్సీసీ క్యాంపులో మొట్టమొదటిసారి చూశానని తెలిపింది. తనకు నచ్చిన క్రికెటర్ తన భర్తేనని చెప్పుకొచ్చింది. 
 
కాగా యాంకర్‌, సినీనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఇటీవల ''రంగస్థలం" చిత్రంలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రంగమ్మత్త క్రేజుతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.