శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (10:09 IST)

ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్.. ఛెత్రి అదుర్స్.. భారత్‌కే కప్

ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ భారత్‌కు సొంతమైంది. భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన సత్తా ఏంటూ నిరూపించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కెన్యాపై 2-0తో విజయం సాధించిన భారత జట్టు కప్ప

ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ భారత్‌కు సొంతమైంది. భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన సత్తా ఏంటూ నిరూపించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కెన్యాపై 2-0తో విజయం సాధించిన భారత జట్టు కప్పును సొంతం చేసుకుంది. ముంబై ఫుట్‌బాల్ ఎరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం భారత్ మెరుగైన ఆటతీరును కనబరచింది. 
 
ఇకపోతే. కెప్టెన్ సునీల్ ఛెత్రి కెరీర్‌లో 102వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు ప్రత్యర్థి కెన్యా జట్టుపై ఒత్తిడి పెంచడంలో భారత ఆటగాళ్లు సఫలం అయ్యారు. కెన్యా గోల్‌ ప్రయత్నాలకు గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు గండికొట్టాడు. డిఫెండర్లు సైతం చక్కని ప్రతిభ కనబరిచి విజయంలో కీలకపాత్ర పోషించారు. 
 
అలాగే ఈ టోర్నీలో తొలి నుంచి భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఛెత్రి అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. తద్వారా మొత్తం 64గోల్స్ సాధించి అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ సరసన చేరాడు.