శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (11:57 IST)

కృష్ణవంశీ ట్విట్టర్‌లో తన అభిమానులకు చెప్పిన మాటలు...

కృష్ణవంశీ డైరక్టర్ ఒకచిత్రాన్ని చేస్తే అంత అద్భుతంగా ఉంటుందని ట్విట్టర్‌లో తన అభిమానులు తెలియజేశారు. తను ఏ చిత్రం చేసిన ప్రేక్షకులకు ఆసక్తికలిగించే విధంగా తీస్తాడని తెలిపారు. ప్రస్తుతం కృష్ణవంశీ చిత్ర

కృష్ణవంశీ డైరక్టర్ చిత్రాన్ని చేస్తే అంత అద్భుతంగా ఉంటుందని ట్విట్టర్‌లో తన అభిమానులు తెలియజేశారు. తను ఏ చిత్రం చేసినా ప్రేక్షకులకు ఆసక్తికలిగించే విధంగా తీస్తాడని తెలిపారు. ప్రస్తుతం కృష్ణవంశీ చిత్రాలు అలాంటి హిట్స్ చెప్పుకోదగినట్లుగా లేవని అందరూ మాట్లాడుకుంటున్నారు. 'ఖడ్గం' లాంటి మరో సూపర్ చిత్రాన్ని కృష్ణవంశీ నుంచి ఆశిస్తున్నట్లుగా అభిమానులు తెలిపారు.
 
దీనిపై కృష్ణవంశీ రెస్పాండ్ అవుతూ... తనకు ఒకేలాంటి సినిమాలు చేయడం ఇష్టంలేదని చేస్తే ఎప్పటికప్పుడు కొత్తచిత్రాలను తీస్తానని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో మరో అభిమాని హిట్ సినిమాను తీయండి అంటూ కృష్ణవంశీని ట్విట్టర్‌లో అడిగాడు. దీంతో కృష్ణవంశీ ఇలా చెప్పాడు. హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు అని రెండు రకాలుగా తెరకెక్కవనీ, ప్రేక్షకులకు నచ్చితే ఏ సినిమానైనా హిట్ అవుతుందని లేదంటే చుక్కలు చూపిస్తాయిని ట్విట్టర్‌లో తన అభిమానులకు తెలియజేశారు.