సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:10 IST)

శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసు.. తెరపైకి యాంకర్, నటి అనుశ్రీ.. రూమ్‌కే తెచ్చేదట!

Anu shree
దేశంలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ ప్రముఖ నటి, యాంకర్ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి శాండిల్‌‌వుడ్‌లోనూ ఈ కేసుపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ప్రముఖ యాంకర్ పేరు బయటకు వచ్చింది. ఆమె మరెవరో కాదు.. యాంకర్, నటి ‘అనుశ్రీ’. మంగళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నారు. 
 
గత ఏడాది సెప్టెంబర్‌లో ఈమెను అధికారులు విచారించారు. అనుశ్రీ డ్రగ్స్‌ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్‌ అమన్‌ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్‌ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేది అని ఆయన పేర్కొన్నారు.
 
అయితే 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్‌ షోలో కలిశాను. తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా కలవలేదని అమన్ శెట్టి అన్నారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదు అని ఆయన అన్నారు. అయితే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని అనుశ్రీ పేర్కొన్నారు.
 
తనపై కావాలనే లేనిపోని నిందలు మోపుతున్నారు అని ఆమె అన్నారు. తను మొదటి నుంచి నిజాయతిగా ఉన్నాను అని.. అందుకే ఈస్థాయికి ఎదిగాను అని ఆమె తెలిపారు. ఇలాంటి కేసులో తనని ఇరికించడం ఎంతో బాధాకరమని ఆమె స్పష్టం చేశారు.