బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (14:39 IST)

యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖి ఐ లవ్ యూ, నిజ్జంగానా?

Pradeep_Sri Mukhi
బుల్లితెర స్టార్ యాంకర్స్ శ్రీముఖి, ప్రదీప్ మధ్య చాల కాలం నుంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆ సన్నిహిత్యం కొన్నిసార్లు హద్దులు దాటడంతో వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు నెట్టింట వస్తూనే ఉంటాయి. అంత క్లోజ్‌గా ఉంటారు మరి వీరిద్దరూ. కానీ రీసెంట్గా మరోసారి వీరిద్దరూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అన్నట్టు మారిపోయారు. 
 
అందుకు కారణం ఓ ప్రోగ్రామ్‌లో అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖి ఐ లవ్ యూ అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. జీ తెలుగు ఛానల్‌లో వచ్చే డ్రామా జూనియర్స్‌కు యాంకర్‌గా ప్రదీప్ చేస్తున్న విషయం తెలిసిందే.

దీనికి వచ్చిన శ్రీముఖి ముసుగు తీసేసి యాంకర్‌ ప్రదీప్‌కు ప్రపోజ్ చేస్తూ కనిపిస్తోంది. ఆ వెంటనే ప్రదీప్ పక్కన నిల్చుని సిగ్గు పడుతుంది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే కామెంట్లు మొదలయ్యాయి.