గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (10:46 IST)

బీరుతో చెలరేగిపోయిన హాట్ తెలుగు యాంకర్..

ఏదైనా కొత్తగా చేస్తేగానీ ప్రేక్షకుల నుండి ఆదరణ లభించడం లేదు. అందుకే తెలుగు యాంకర్, మోడల్ శ్రావ్యరెడ్డి విభిన్నమైన యూట్యూబ్ వీడియోలతో చెలరేగిపోతోంది. ఇటీవల బీర్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్ అంటూ కొత్త కొత్త సవాళ్లతో ప్రేక్షకులకు తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తోంది. శ్రావ్య బీర్ ఛాలెంజ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దాదాపు కాటన్ చిల్డ్ బీర్లతో బాత్ టబ్బులో స్నానం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
 
కొందరు అభిమానులు నల్లచీరలో ఆమె సోయగాలను ఆస్వాదిస్తుంటే, మరి కొందరేమో మాకు తాగడానికి లేకుండా ఉంటే నువ్వు స్నానం చేస్తున్నావా? అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా శ్రావ్య అనుకున్నట్లుగా మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ వీడియోకు. కొంతకాలం క్రితం ఐస్ ఛాలెంజ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో అందంగా నీలిరంగు చీరలో ముస్తాబై, బాత్ టబ్బులో ఐస్ ముక్కలు వేసుకుని, అందులో స్నానం చేసింది. నెక్స్ట్ ఏ ఛాలెంజ్‌తో వస్తుందోనంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.