బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (09:48 IST)

అనసూయ, సుమ ఆ నిర్ణయం తీసుకున్నారట...!?

సెలెబ్రిటీల్లో కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రముఖులు కరోనా బారిన పడిన తరుణంలో సెలెబ్రిటీల్లో కొందరు షూటింగ్‍లకు దూరంగా వుండటం మేలనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఎఫెక్ట్ టాలీవుడ్‌పై కూడా పడింది. టాలీవుడ్‌లో యాంకర్స్ కూడా షూటింగ్స్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. 
 
ముఖ్యంగా టాలీవుడ్ టాప్ యాంకర్స్‌గా పేరున్న సుమ, అనసూయలు ఇకపై ఏ షూటింగ్‌లో పాల్గొనకూడదనే నిర్ణయానికి వచ్చారట. టీవీ పరిశ్రమని కూడా కరోనా భారీగా తాకుతున్న నేపథ్యంలో.. ఇకపై వీరిద్దరూ షూటింగులకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
Anasuya
 
యాంకర్లుగా వీరిద్దరూ ఎన్నో షోలు చేస్తుంటారు. వాటి నిమిత్తం షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ పరిస్థితులు దారుణంగా మారుతుండటంతో.. షూటింగ్స్ చేయకపోవడమే బెటర్ అని వారు భావిస్తున్నారట. దీంతో వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.