ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (12:33 IST)

అంజలి స్టన్నింగ్ లుక్.. బక్క పలచగా సీతమ్మ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

anjali
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటెం సాంగ్‌లో ఆడిపాడిన ఈ బ్యూటీ రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. 
 
ఈ సినిమాలో అంజలి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా అవకాశాలు రాని సమయంలో ఇలా సరికొత్త పంథాల్లో మళ్లీ టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విదేశాల్లో హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది అంజలి.
 
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ లేటెస్ట్‌ ఫొటోస్‌ మాత్రం స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. పూర్తిగా సన్నగా మారి వావ్‌ అనిపించేలా ఉంది. దీంతో ఈ ఫొటోలు చూసిన అంజలి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.