గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జనవరి 2022 (10:10 IST)

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం: 'నచ్చావులే' నటుడు శ్రీనివాస్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర, వెండితెరపై నటించిన నటుడు శ్రీనివాస్ గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు.

 
గత కొన్ని రోజులుగా అతడి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో చికిత్స తీసుకుంటున్నాడు. ఐతే అతడి ఆరోగ్యం ఎంతమాత్రం మెరుగవకపోవడంతో బుధవారం రాత్రి మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

 
శ్రీనివాస్ పలు బుల్లితెర సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్నాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంతో పాటు నచ్చావులే చిత్రంలో మంచి పేరు వచ్చింది.