Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పవన్ "భీమ్లా నాయక్" నుంచి మరో అప్డేట్..

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:03 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి 'అంతాఇష్టం' అనే పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
అలాగే, తాజాగా పవన్‌తో నిత్యామీనన్ కూర్చుని ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. సినిమాలో పవన్‌కు భార్యగా నిత్యమీనన్ నటిస్తున్నారు. దాంతో చిత్రం నుండి మొదటి సారి పవన్ నిత్యామీనన్‌ల పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
ఇక పోస్టరులో పవన్ ఓ రాయిపై కూర్చుని ఉండగా నిత్యా మీనన్ పక్కన గద్దె‌పై కూర్చుని ఉంది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే అంతా ఇష్టం అనే పాట రొమాంటిక్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు కనిపిస్తోంది.
 
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇది మలయాళ చిత్రానికి రీమేక్. 

అన్నీ చూడండి

కారులో పరాయి మహిళతో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...

9/11 తరహా దాడులకు కుట్ర : ఫ్లైదుబాయ్ కో-పైలెట్ వాంగ్మూలం

లారీ ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి... పుట్టిన రోజున విషాదం

విస్తరించిన ఉపరితల ద్రోణి : వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు

'దృశ్యం' సినిమా చూసి 2 వేల కిమీ ప్రయాణించి తండ్రిని గొడ్డలితో నరికేసిన తనయుడు

అన్నీ చూడండి

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్

తర్వాతి కథనం
Show comments