గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (22:18 IST)

బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపం: పవన్ కళ్యాణ్

బద్వేలు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలవడం లేదని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అనంతపురం జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన బహిరంగ సభలో ఈ విషయాన్ని తెలియజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందిన ఉప ఎన్నిక వచ్చిందని మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసిపి టికెట్ ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.