మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:34 IST)

బద్వేల్ బై పోల్ : వైకాపా అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి అక్టోబరు 30న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున పోటీ చేసే అభ్యర్థిగా డాక్టర్ సుధ పేరును ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. 
 
గురువారం తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన బద్వేల్‌ నియోజకవర్గ ఉప ఎన్నికపై ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. 
 
2019లో దాదాపు 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తుచేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చేందిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.