సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (13:00 IST)

ప్రభాస్ నా కొడుకు అంటున్న అనుష్క.. అవునా?

ప్రభాస్‌పై అనుష్క చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది అనుష్క. భాగమతి సినిమా తర్వాత రెండేళ్లుగా మరో సినిమా చేయని అనుష్క.. ప్రస్తుతం హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం సినిమాతో తెరపైకి వస్తోంది. ఏప్రిల్ 2న సినిమా విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా ఓ ప్రోగ్రామ్‌కు వచ్చిన అనుష్క.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఫోటో చూపించగానే తన కొడుకు అంటూ సమాధానమిచ్చింది. ప్రభాస్ మనుషులకు చాలా బాగా గౌరవమిస్తాడంటూ తెలిపింది. 
 
ఇద్దరికీ చాలా పోలికలున్నాయని ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సుమ అడిగితే.. కొడుకు కదా అంటూ మరో పంచ్ వేసింది అనుష్క. సరే.. కొడుకు కాదు.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండి అంటే అందుకే కదా ఈయన కొడుకు అయ్యాడు అంటూ మరో సెటైర్ వేసింది అనుష్క. ఇలా ప్రభాస్‌పై అనుష్క చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.