శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (18:46 IST)

కరోనా అంటే చెన్నై ప్రజలకు లెక్క లేదా?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చెన్నై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై క్రికెటర్ అశ్విన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైనాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 125 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎమెర్జెన్సీ ప్రకటించడం జరిగింది. అయితే తమిళనాడు రాజధాని చెన్నై ప్రజలు మాత్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. 
 
ఇందులో భాగంగా ట్విట్టర్‌లో స్పందించిన అశ్విన్.. ప్రపంచ దేశాల్లో ప్రజలకు పలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో చెన్నై ప్రజలు మాత్రం ఎండలో కరోనా వ్యాపించదనే గుడ్డి నమ్మకంలో వున్నారని.. నమ్మే విషయాలన్నీ జరగవని అశ్విన్ ఎత్తిచూపాడు.