మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:58 IST)

అక్కడ పొటాటో ఐస్ క్యూబ్స్ అప్లై చేయండి, చిన్మయి శ్రీపాదకు సలహా

సోషల్ మీడియా విజృంభణ తర్వాత ఏ సమస్యకైనా, ఎలాంటి విషయాన్నయినా ఇట్టే షేర్ చేసేస్తున్నారు. ఇందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదునుకోండి. తమ భావాలను, ఇష్టాయిష్టాలను సోషల్ మీడియాలో షేర్ చేస్కుంటుంటారు.
 
అప్పుడప్పుడు తమ అభిమానులతో లైవ్ చాట్ చేస్తుంటారు. ఈ సమయంలో కొందరు తుంటరి ప్రశ్నలు వేస్తుంటారు, తగ్గట్లు చీవాట్లు కూడా తీసుకుంటూ వుంటారు.
 
ఆ సంగతి ప్రక్కనపెడితే.. చిన్మయి శ్రీపాద ఇటీవల తన బుగ్గలపై మొటిమల తాలూకు మచ్చలను ఎలా పోగొట్టుకోవాలో తెలియక, సరైన చిట్కా ఎవరైనా చెప్తారేమోనని ఆ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను చూసినవారు తమకు తోచిన విధంగా స్పందించారు. ఓ అభిమాని అయితే... మొటిమలు, మచ్చలు వున్నచోట బంగాళ దుంపల ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, త్వరగా తగ్గిపోతాయని సలహా ఇచ్చింది. మరి చిన్మయి ఆ చిట్కాను ఫాలో అయిందో లేదో?