సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (10:53 IST)

నిరుద్యోగులకు శుభవార్త.. నార్త్ సెంట్రల్ రైల్వేలో 480 ఖాళీలు

నార్త్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో ఏప్రిల్ 16లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్ విభాగంలో 286 పోస్టులు, వెల్డర్-11 పోస్టులు, మెకానిక్-84 పోస్టులు, కార్పెంటర్-11 పోస్టులు, ఎలక్ట్రీషియన్-88 పోస్టులున్నట్లు నార్త్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 
 
అర్హతల వివరాలు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు ఎన్సీవీటీకి అనుబంధం పొందిన సంస్థ నుంచి ఐటీఐ పాసై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
 
అప్లికేషన్ ఫీజు: అప్లై చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ. 170ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.