ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (09:30 IST)

తెలంగాణలో కొత్తగా 148 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో 24,695 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 148 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,96,950కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 
 
రాష్ట్రంలో సోమవారం కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,620కి చేరింది. కరోనా బారి నుంచి 150 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,93,690కి చేరింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,640 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 641 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 83,60,950కి చేరింది.