బ్రెజిల్‌లో కరోనా విజృంభణ.. రోజుకు 90,303 కేసులు.. రోజుకు 2,648 మంది మృతి

brazil
brazil
సెల్వి| Last Updated: గురువారం, 18 మార్చి 2021 (10:59 IST)
బ్రెజిల్‌లో కరోనా కరాళ నాట్యం చేస్తోంది. దేశంలో ఒక్క రోజు 90,303 కేసులు నమోదై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,648 మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,82,000 మంది కరోనా కబళించింది. అంతక ముందు అంటే మంగళవారం రికార్డు మృతి కేసులు 2,841 నమోదయ్యాయి.

కరోనా కేసులు పెరిగిపోవడంతో పాటు సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైరో బోల్సోనారోపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహమ్మారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు బల్సోనారోపై ఒత్తిడి పెరుగుతోంది.

కాగా, అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదౌతున్న దేశాల్లో బ్రెజిల్‌ నాల్గవ స్థానంలో నిలిచింది. కాగా, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మార్సెల్‌క్యూరో స్థానంలో ఎటువంటి వైద్య అనుభవం లేని ఆర్మీ జనరల్‌ ఎడ్వర్డో పజుఎల్లో నియమించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :