బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2017 (16:55 IST)

సైరా నుంచి తప్పుకుంటున్నా: ఏఆర్ రెహ్మాన్ ప్రకటన

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరా-నరసింహారెడ్డి సినిమా మోషన్ పోస్టర్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. బాలీవు

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరా-నరసింహారెడ్డి సినిమా మోషన్ పోస్టర్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతితో పాటు మన డేరింగ్ స్టార్ జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పనిచేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రవి వర్మన్ ఈ సినిమాకు డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ చిత్రం నుంచి రెహ్మాన్ తప్పుకున్నారు. 
 
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న లైవ్ షో సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెహమాన్, ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. చిరు అంటే తనకు చాలా ఇష్టమని కేవలం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా రెహమాన్ ప్రకటించారు.