శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (13:11 IST)

ట్యాక్సీవాలా వచ్చిందంటే.. అర్జున్ రెడ్డిని మరిచిపోతారు..

విజయ్ దేవరకొండ ''అర్జున్ రెడ్డి'' ద్వారా సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు తర్వాత విజయ్ చేతిలో బోలెడు సినిమాలున్నాయి. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే రోల్స్ చేసే అర్జున్ రెడ్డి తాజాగా "ట్యాక్సీ వాలా'' చిత్రం

విజయ్ దేవరకొండ ''అర్జున్ రెడ్డి'' ద్వారా సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు తర్వాత విజయ్ చేతిలో బోలెడు సినిమాలున్నాయి. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే రోల్స్ చేసే అర్జున్ రెడ్డి తాజాగా "ట్యాక్సీ వాలా'' చిత్రంలో కనిపించనున్నాడు. 
 
తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమా చేసినప్పుడే కొత్త కాన్సెప్ట్ చేశానని అనిపించింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు. భారీ హిట్‌ టాక్‌తో పాటు తనకు మంచి గుర్తింపు సంపాదించిపెట్టిన అర్జున్ రెడ్డి తర్వాత ఏ మంత్రం వేశావే, మహానటి, ట్యాక్సీవాలా సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. 
 
ట్యాక్సీవాలా చిత్రంలో తాను క్యాబ్ డ్రైవర్‌గా నటిస్తున్నానని తెలిపాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా ఫ్యాన్స్ ఆశించిన విధంగా వుంటుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం తర్వాత అర్జున్ రెడ్డిని మరిచిపోతారని విజయ్ దేవరకొండ అన్నారు.