మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:49 IST)

''అర్జున్ రెడ్డి'' సీక్వెల్ వచ్చేస్తుందా? విజయ్ దేవరకొండ ఏమన్నారు?

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ''అర్జున్ రెడ్డి'' కొత్త ట్రెండ్‌ను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకున్న ఈ సిని

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ''అర్జున్ రెడ్డి'' కొత్త ట్రెండ్‌ను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకున్న ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందనే వార్త ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంకా సోషల్ మీడియాలోనూ అర్జున్ రెడ్డి సీక్వెల్‌పై చర్చ మొదలైంది. 
 
ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి సీక్వెల్‌పై విజయ్ దేవరకొండ స్పందించాడు. అర్జున్ రెడ్డి సీక్వెల్‌ గురించి సందీప్ రెడ్డి తనతో మాట్లాడారని.. 40 ఏళ్లు వచ్చాక అర్జున్ రెడ్డి వ్యవహారశైలి ఎలా వుంటుందనే విషయం చెప్తే బాగుంటుందని తన అభిప్రాయం అన్నాడు. 
 
మరోవైపు చెర్రీతోనూ, మరోవైపు మహేష్ బాబుతోనూ సినిమా చేసేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ''అర్జున్ రెడ్డి'' సీక్వెల్‌ను ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో వేచి చూడాలి.