శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (11:07 IST)

అవును.. ఫోర్ ప్లే చేద్దామా అని అర్జున్ అడిగాడు.. దృష్టి మళ్లించేందుకే..?

''నిబునన్'' సినిమా షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ రెచ్చిపోయాడని, తనను తడిమాడని, ఇలాగే ఫోర్ ప్లే చేద్దామా డైరెక్టర్.. అంటూ దర్శకుడి వైపు కేసి చూస్తూ అన్నాడని శ్రుతి హరిహరన్ మీ టూలో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా దర్శకుడు కూడా అర్జున్ అలాంటి వాడు కాదని చెప్తున్నాడు. 
 
అర్జున్‌కు చాలామంది మద్దతిస్తున్నారు. ఇంకా శ్రుతి క్షమాపణలు చెప్పాలని హీరో అర్జున్ డిమాండ్ చేస్తున్నాడు. అంతేగాకుండా శ్రుతి ఆరోపణలపై అర్జున్ కోర్టుకెక్కాడు. శ్రుతిపై రూ.5 కోట్ల పరువునష్టం దావాను అర్జున్ దాఖలు చేశాడు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో శ్రుతి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అర్జున్ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. తాను చేసిన ''మీ టూ'' ఆరోపణల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే అర్జున్ ఈ కేసు పెట్టాడని శ్రుతి ఆరోపించింది. కాగా, శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు ముందు విచారణకు రానుంది.