శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: మంగళవారం, 13 నవంబరు 2018 (16:09 IST)

జగన్ పైన కోడి కత్తితో దాడి... ఏం చెపుతారు? బాబుకు హైకోర్టు నోటీసులు

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన విశాఖపట్టణం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి తనపై దాడి జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మరో 8 మందికి నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తమ యొక్క ప్రతిస్పందనను 15 రోజుల్లోపు తెలియజేయాలంటూ నోటీసులో పేర్కొంది. 
 
తమ యొక్క స్పందనను కూడా సీల్డ్ కవరులో వుంచి పంపాలని చెప్పిన కోర్టు తదుపరి విచారణను నవంబరు 27కి వాయిదా వేసింది. కాగా గత నెల 25న విశాఖ నుంచి హైదరాబాదుకు వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటానని చెప్పి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ మోహన్ రెడ్డి భుజానికి తీవ్ర గాయమైంది.