గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 నవంబరు 2018 (19:07 IST)

జగన్, పవన్ లోకల్ లీడర్లు... వాళ్లకంత సీన్ లేదు...

టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీరామారావు బాటలో పయనిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ భావాలతో దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారని శాసనమండలి విప్ డొక్కా మాణిక్య ప్రసాద్ కొనియాడారు. ఎన్డీయే, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లతో జాతీయ రాజకీయాల్లో తెలుగువారి సత్తా సీఎం చంద్రబాబు చాటారన్నారు. 
 
ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలంతా వెన్నుదన్నుగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్, పవన్ కల్యాణ్ లోకల్ నేతలన్నారు. వారికి జాతీయ దృక్పథం లేదన్నారు. 
 
ఏపీ పునర్విభజన చట్టం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పీఎం నరేంద్రమోడి ముఖం చాటేయడంతో, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి వ్యూహరచనకు తాళలేక, అభివృద్ధి అజెండా వదలి బీజేపీ నాయకులు మత రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారని శాసనమండలి విప్ డొక్కా మాణిక్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.