శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 8 నవంబరు 2018 (18:11 IST)

థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ.. చచ్చేటప్పుడు ఆ నేత పేరే చెబుతాను.. ఎవరు..?

థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ పేరు చెబితేనే వెంటనే గుర్తుకు వచ్చేది నటుడు పృధ్వీ రాజ్. ఇప్పటికే 75 సినిమాల్లో నటించారు పృధ్వీరాజ్. ఎన్నో హాస్యపాత్రల్లో నటించిన పృధ్వీరాజ్ గత కొన్నినెలల ముందు వరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాంటే పృధ్వీకి అస్సలు ఇష్టముండేది కాదు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే మాత్రం బాగా ఇష్టం. అయితే తాజాగా ఆయన జగన్ జపం చేస్తున్నాడు. 
 
వైసిపిలో చేరుతారో లేదోనన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు గానీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం తనకు ప్రాణమంటున్నారు. నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు.... కానీ వై.ఎస్.జగన్ అంటే ప్రాణం. నిద్రలో కూడా నేను ఎవరి పేరైనా జపిస్తున్నానంటే అది ఒక్క జగన్ పేరునే. నా ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన పేరునే నేను జపిస్తా. 
 
జగన్ లాంటి నాయకుడు ప్రజలకు అవసరం. ప్రజా సేవలో జగన్ పడుతున్న ఆరాటం నాకు బాగా నచ్చింది. అందుకే పాదయాత్రలో వెళ్ళి జగన్‌ను కలిశానంటున్నారు పృద్వీ. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్నది జగన్ నిర్ణయిస్తారంటున్నారు పృధ్వీరాజ్.