శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 2 నవంబరు 2018 (21:55 IST)

జగన్ పైన దాడి... స్పందించిన పవన్... ఎవరైనా ఆ పని చేస్తారా?

ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దురదృష్టకరం.. ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం సరికాదు అన్నారు పవన్ కల్యాణ్. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలి... తల్లీ, చెల్లి దాడి చేయించారని అనడం తప్పు. ఎక్కడైనా తల్లే కొడుకుపై దాడి చేయిస్తుందా... విజయమ్మ, షర్మిల నన్ను ఎన్నో తిట్టారు. అందుకని నేను వాళ్ళని ఏమి అనలేదు కదా.. లక్ష్మణ రేఖను దాడి టీడీపీ నేతలు వ్యాఖ్యలు చెయ్యడం సరికాదు.
 
దాడి కావాలని చేశాడా.. ఎవరైనా చేయించారా.. కుట్ర ఉన్నదా అనేది పోలీసుల విచారణలో తేల్చాలి.. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలి.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉంది. నా పర్యటనలో కూడా పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో ఇబ్బందిపడ్డాను.
 
కాంగ్రెస్ టీడీపీ కలయిక చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. మద్దతు ఇచ్చిన మాలాంటోళ్లని కాంగ్రెస్ పార్టీతో కలవడం అధికార దాహానికి నిదర్శనం... అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం కాంగ్రెస్ హఠావో అని నినాదంతో మీకు మద్దతు ఇస్తే మీరు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో కలవడం ఎంతవరకూ కరెక్ట్... 
 
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి యాత్రలు చేస్తున్నా.. అధికారం కోసం కాదు... చింతమనేని తీరు ఇంకా మారలేదు... మీడియా పైన వ్యాఖ్యలు చేశారు.. ఖండిస్తున్నా అని అన్నారు.