గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 2 నవంబరు 2018 (18:47 IST)

పవన్ కళ్యాణ్‌ వేషం మార్చడానికి అసలు కారణాలు ఇవేనట..?

సినిమావాళ్ళు రకరకాల గెటప్‌లలో కనిపిస్తూ ఉంటారు. ఆరు నెలలకు ఒకసారి మేక్ ఓవర్ అవుతూ ఉంటారు. రాజీకీయాల్లోకి వచ్చినా కూడా జనసేనాని ఆ అలవాటును వదలనేలేదు. మొన్నటి వరకు గుబురు గడ్డం, పొడుగు జుట్టు, పంచ కట్టు, తెల్ల పైజామాతో కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా సెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. గడ్డం ట్రిమ్ చేశాడు. జుట్టు షార్ట్ చేశాడు. పంచె కట్టు, పైజామా తీసేసి నీటుగా బెల్టు పెట్టి ఇన్ చేసి హీరోలా మారిపోయాడు. 
 
ఈ గెటప్ వెనుక మర్మమేమిటోనని అందరూ భావించారు. పవన్‌కు పాత గెటప్ నచ్చలేదా లేక ఇంకేదైనా షూటింగ్ ఉందా అన్న రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే పవన్ గెటప్ మార్చడం వెనుక మూడు కారణాలున్నాయట. ఒకటి పవన్ తన సొంత ఛానల్‌లో చేస్తున్న షూటింగ్‌లో భాగమట. రెండు పంచె కట్టు మీద సెటైర్లు పేలాయట. నాదెండ్ల మనోహర్ సలహాతో పంచె వదిలి ప్యాంట్, షర్టుతో కనిపించారట. 
 
హెయిర్ డైలు పవన్‌కు అలవాటే అయినా, గడ్డానికి వాడుతున్న రంగు వల్ల పవన్ కాస్త ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే కంటికి ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స చేయించుకున్న పవన్‌కు ఈ రంగుల కారణంగా మరోసారి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించడంతో గడ్డాన్ని కూడా వదిలేశారట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో బాగున్నారని జనసేన పార్టీ నేతలు, అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారట.