గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (12:58 IST)

దుల్కర్ సల్మాన్ ''అతడే'' ట్రైలర్ ఎలా వుందో చూడండి.. (వీడియో)

బెజోరు నంబియార్ దర్శకత్వంలో మలయాళంలో రూపుదిద్దుకుని హిట్ అయిన సినిమా ''సోలో''. దుల్కర్ సల్మాన్, నేహాశర్మ, ధన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో ''అతడే'' అనే పేరిట రిలీజ్ కానుంది. ఈ చిత్రాన

బెజోరు నంబియార్ దర్శకత్వంలో మలయాళంలో రూపుదిద్దుకుని హిట్ అయిన సినిమా ''సోలో''. దుల్కర్ సల్మాన్, నేహాశర్మ, ధన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో ''అతడే'' అనే పేరిట రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని వెంకటసాయి ప్రియాన్నీ క్రియేషన్స్ పతాకంపై వెంకటేష్ గాజుల తెలుగులో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఇటీవలే ఈ సినిమా పాటలను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి పాటల సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమాలో నాలుగు రకాల విభిన్న కథలు మేళవింపుగా ఉంటాయి. హీరో దుల్కర్ సల్మాన్ అన్ని షేడ్స్‌లోనూ బాగా నటించారు. ప్రొడక్షన్, టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమా చూస్తున్నప్పుడు డబ్బింగ్ చిత్రమనే ఫీలింగ్ రాదని చెప్పారు.
 
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో దుల్కర్ జుట్టుతో యాక్షన్ అదరగొట్టాడు. మహానటిలో జెమినీ గణేశన్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్.. యాక్షన్ హీరోగా ''అతడే''లో కనిపిస్తాడు. దుల్కర్ లుక్ ''అతడే'' ట్రైలర్లో ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి.