శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:50 IST)

'జబర్ధస్త్' అవినాష్ నిశ్చితార్థం పూర్తి - నా అనూజతో త్వరలో పెళ్లి

'జబర్ధస్త్' అనే హాస్య కార్యక్రమం ద్వారా మంచి పాపులర్ అయిన అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జ‌బ‌ర్ధ‌స్త్ క్రేజ్ కారణంగా అవినాష్‌కి బిగ్ బాస్ ఆఫర్ వ‌చ్చింది. దీంతో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. 
 
ఉన్నన్ని రోజులు జోకులు పేలుస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వ‌చ్చాడు. అయితే హౌజ్‌లో ఉన్న స‌మ‌యంలో అరియానాతో రాసుకుపూసుకు తిర‌గం వ‌ల‌న ఇద్ద‌రి మ‌ధ్య ఏదో నడుస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఆయన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. 
 
"మ‌న జీవితంలోకి రైట్ ప‌ర్స‌న్ వ‌చ్చిన‌ప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయోద్దు. మా ఫ్యామిలీలు క‌లిసాయి. మేము క‌లిసాం. వెంట‌నే ఎంగేజ్‌మెంట్ అయింది. మీరు అంద‌రు ఎప్ప‌టి నుండో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. 
 
నా అనూజ‌తో త్వ‌ర‌లోనే చేసుకోబోతున్నాను. ఎప్ప‌టిలానే మీ ఆశీర్వాదాలు ఉంటాయ‌ని కోరుకుంటున్నాను" అని అవినాష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే, త‌న‌కు కాబోయే శ్రీమ‌తి ఫొటోలను కూడా అవినాష్ షేర్ చేయగా, ప్రతి ఒక్కరూ విషెస్ తెలుపుతున్నారు.