శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (23:15 IST)

రెండు అడుగుల నరేష్‌కు కాబోయే భార్య ఆరు అడుగులు

ఒరే వీరశివారెడ్డి.. మీ ఇంటికి వస్తా.. మీ నట్టింటికి వస్తానంటూ తమాషా డైలాగులతో జబర్ధస్త్‌లో అందరినీ అలరిస్తున్నాడు నరేష్. ఉండేది రెండు అడుగులే అయినా అతను చెప్పే పంచులు అందరినీ ఆకట్టుకుంది. పొట్టిగా ఉన్నా సరే అతని వయస్సు మాత్రం చాలా ఎక్కువే.
 
అయితే ఇప్పటికే నరేష్‌కు వివాహం జరిగింది. భార్య అతడిని విడిచి వెళ్ళిపోయిందంటూ ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని నరేష్ ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు నిజంగానే పెళ్ళి చేసుకోబోతున్నాడట నరేష్. అది కూడా భీమవరం అమ్మాయితోనే పెళ్ళి జరుగబోతోందట.
 
ఇప్పటికే పెళ్ళిచూపులు కూడా అయిపోయాయట. అంతేకాదు పెళ్ళికి సంబంధించిన విషయాలను కూడా మాట్లాడేసుకున్నారట. అమ్మాయి డిగ్రీ వరకు చదివిందట. 6 అడుగుల హైట్ ఉంటుందట. 
 
నరేష్ అంటే చాలా ఇష్టమట. అతను చేసే కామెడీ చూసి బాగా ఇష్టపడిందట అమ్మాయి. దీంతో నరేష్‌తో వివాహమంటే ఎగిరి గంతేసినంత పని చేసి అతన్నే చేసుకుంటానని చెప్పిందట. దీంతో వీరి వివాహం త్వరలో జరుగబోతోందని తెలుస్తోంది.
 
నరేష్ వివాహ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు శాంతిస్వరూప్, బుల్లెట్ భాస్కర్. నరేష్ ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఇక అతన్ని ఎవరూ ఆపలేరు. పట్టుకోలేరు అంటూ చెప్పారు.