బేబీ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
Anand Devarakonda, SKN, Sai Rajesh, Viraj Ashwin, Vaishnavi Chaitanya
హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. త్వరలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రచన, దర్శకత్వం: సాయి రాజేష్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మ, ఆర్ట్: సురేష్, సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్
చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టి, పీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా, కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.